మన్యంలో భారీ వర్షం

చింతూరు (ఏఎస్ఆర్ జిల్లా) (ఆంధ్రప్రభ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరిక ( heavy rainfall warning) నేపథ్యంలో ఆదివారం రాత్రి నుండి అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం నుండి జిల్లాలోని పలు మండలాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు అల్లూరి సీతారారామరాజు జిల్లాలోని 22 మండలాల్లో 267.60 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

వైరమవరం మండలంలో అత్యధికంగా 68.8 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా అడ్డతీగల మండలంలో 0.4 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఇది ఇలా ఉంటే సోమవారం ఉదయం నుండి ఆయా మండలాల్లో వర్షం కురుస్తూ వాతావరణం చల్లగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Seetharamaraju District) లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని వైరమవరం మండలంలో 68.8, రంపచోడవరం మండలంలో 26.8, మారేడుమిల్లి మండలంలో 7.4, చింతూరు రెవెన్యూ డివిషన్లోని ఎటపాక మండలంలో 62.4, పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని గూడెం కొత్తవీధి మండలంలో 39.2, కొయ్యూరు మండలంలో 22, ముంచంగిపుట్టు మండలంలో 9.4, అనంతగిరి మండలంలో 6.8, హుకుంపేట మండలంలో 6.6 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు అయింది. అదేవిధంగా మిగతా మండలాల్లో సైతం కొద్దిపాటి వర్షాలు కురిశాయి.


ఏజెన్సీ (agency) లో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మన్యంలో హలొ ఆదివాసీ చలో ఐటీడీఏ కార్యక్రమానికి ఆదివాసీ సంఘాలు, గిరిజన సంఘాలు, ఆదివాసీ జేఏసీల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి వర్షం ఆటంకం కలిగించేలా ఉంది. చింతూరులో ప్రస్తుతం వర్షం కురుస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది.

Leave a Reply