నిజామాబాద్ (Nizamabad) జిల్లా బోధన్ నియోజకవర్గం గుండా ప్రవహించే మంజీరా (Manjeera) గోదావరి నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. మంజీరా నదిపై బోధన్ (Bodhan) మండలం ఖండ్ గాం వద్ద మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ నిర్మించిన వంతెన పై నుంచి నీరు ప్రవహించడంతో రాక పోకలు నిలిపి వేశారు.మంజీరా నది ఉదృతంగా ప్రవహించడంతో సాలురా మండలం మందర్నా ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ (SriRamSagarBackwaters) రావడంతో మండలంలోని ముంపు గ్రామమైన హంగర్గ గ్రామ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద నీరు ఉదృతమైతే గ్రామంలోకి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మంజీరా, గోదావరి (Godavari) సరిహద్దుల వెంట ఉన్న పంట పొలాలు నీట మునిగాయి.

Leave a Reply