ఎండ తీవ్రతలో విషాదం..

ఎండ తీవ్రతలో విషాదం..

ఉయ్యూరు, ఆంధ్రప్రభ : ఉయ్యూరులో వడదెబ్బతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి ఉయ్యూరు పట్టణంలోని విజయ హాస్పిటల్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో మృతదేహంగా కనిపించాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

మృతుడి వివరాలు తెలిసిన వారు 08676-233233, 9440627047 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

వడగాలుల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Leave a Reply