HEALTH INSURANCE: హెల్త్ పాలసీ… హాఫ్ గ్యారెంటీ!

చిన్న అక్షరాలు.. పెద్ద మాయాజాలం!
గ్లోవ్స్, బెడ్ చార్జీలపై లిమిట్స్..
ఇన్సూరెన్స్ ముసుగులో జేబులు ఖాళీ దక్షిణాదిలో తెలంగాణ టాప్

HEALTH INSURANCE: దేశంలో ‘వైద్యం’ వెనుక జరుగుతున్న అసలు కథేంటి? హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు చేతిలో ఉన్నా, ఆసుపత్రి గడప తొక్కిన ప్రతీ కుటుంబం ఎందుకు జేబులు ఖాళీ చేసుకుంటున్నది? క్లెయిమ్లు ఆమోదించామంటూనే ఇన్సూరెన్స్ కంపెనీలు వేసే అదనపు ఖర్చులు ఏంటి? బిల్లుల్లో సగానికి పైగా భారంగా మారే ఆ ఖర్చులేంటి? ఇవన్నీ ఒకెత్తయితే… దక్షిణాది రాష్ట్రాల ప్రజలనే ఈ హాస్పిటల్ ఖర్చులు అత్యధికంగా ఎందుకు పీల్చి పిప్పి చేస్తున్నాయి? హాస్పిటల్ డిశ్చార్జ్ బిల్లు చూడగానే సామాన్యుడి గుండె ఎందు గుబేలు అంటున్నది? ఇన్సూరెన్స్ పాలసీల్లో చిన్న అక్షరాల వెనుక దాగున్న చేదు నిజాలేంటి? ఒక్క ఐసీయూ అడ్మిట్ ఏటా లక్షల కుటుంబాలను అప్పుల ఊబిలోకి ఎలా తోసేస్తున్నది? కార్పొరేట్ హాస్పిటళ్లు, ఇన్సూరెన్స్ సంస్థల మధ్య పేద, మధ్య తరగతి ప్రజలు ఎలా
నలిగిపోతున్నారనే అంశంపై స్పెషల్ స్టోరి..

వైద్యం పొందడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. కానీ, ఆ వైద్యానికి అయ్యే ఖర్చే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు కోలుకోలేని దెబ్బగా మారుతున్నది. రోజురోజుకూ పెరిగిపోతున్న ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ బిల్లులు ఒక వైపు ఉంటే… ఇన్సూరెన్స్ ఉందనే ధైర్యం ఉన్నప్పటికీ క్లెయిమ్ సమయంలో ఊహించని కోతలు పడటం మరో వైపు బాధిస్తున్నది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నప్పటికీ.. సగటున 30% నుంచి 40% వరకు బిల్లును రోగులే తమ జేబుల నుంచి పే చేయాల్సి వస్తున్నది. రూమ్ రెంట్పై పరిమితులు, క్లెయిమ్లో విధించే సబ్-లిమిట్లు, కొన్ని రకాల మందులు, సేవలకు ఇన్సూరెన్స్ వర్తించడం లేదు. పీపీఈ కిట్లు, గ్లోవ్స్, కాటన్ వంటి నాన్-మెడికల్ వస్తువుల పేరిట వేసే చార్జీలను ఇన్సూరెన్స్ కంపెనీలు రీయింబర్స్ చేయడం లేదు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే టైమ్లో ఇన్సూరెన్స్ కార్డ్ ఉన్నప్పటికీ.. అదనంగా వేల రూపాయలు చెల్లించలేక పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి.

దేశంలో హాస్పిటల్ పాలైతే జేబులు ఎక్కువ ఖాళీ అవుతున్నది దక్షిణాది రాష్ట్రాల్లోనే, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు పోను తెలంగాణలో ప్రతి కేసుకు సగటున రూ.46,316, తమిళనాడులో రూ.44,535, ఆంధ్రప్రదేశ్ లో రూ.39,170 రోగులే తమ సొంత జేబుల నుంచి భరించాల్సి వస్తున్నది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ హైటెక్ కార్పొరేట్ హాస్పిటళ్ల వినియోగం ఎక్కువగా ఉండటం, రూమ్ రెంట్లపై ఇన్సూరెన్స్ కోతలు వర్తించడమే ప్రధాన కారణం. ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రి పాలైతే జేబులు ఖాళీ అయ్యే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. అత్యాధునిక వైద్య సదుపాయాలు, అదనపు చార్జీలు వంటివే భారీ ఖర్చులకు కారణం.

రూ.67వేలతో చండీగఢ్ టాప్..

చండీగఢ్ పూర్తిగా పట్టణ ప్రాంతం కావడం వల్ల అక్కడ భూమి విలువ, హాస్పిటల్స్ నిర్వహణ, ఇతర వసతుల ఖర్చులు చాలా ఎక్కువ. దీనికి తోడు ఉచిత, రాయితీలతో కూడిన ప్రభుత్వ వైద్య సేవలు తక్కువగా ఉండటం వల్ల ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ పైనే
ఆధారపడాల్సి వస్తున్నది. ఈ కారణాల వల్లే అక్కడ బెడ్ చార్జీలు, ట్రీట్మెంట్ ఖర్చులు పెరిగి సగటు హాస్పిటల్ సొంత ఖర్చు రూ.67,779 వరకు వెళ్లిపోతున్నది.

లడఖ్ కేవలం రూ.6,315..

లడఖ్ హాస్పిటల్స్లో వైద్యానికి అయ్యే సగటు అవుట్-ఆఫ్-పాకెట్ ఖర్చు రూ.6,315 మాత్రమే. లడఖ్ 99.10% హాస్పిటల్ కేసులు ప్రభుత్వ దవాఖానాల్లోనే జరుగుతాయి. ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ప్రభుత్వ హాస్పిటల్స్పై ఎక్కువగా ఆధారపడే ప్రాంతాల్లో జేబు ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.

అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్ నెట్వర్క్..

హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో అత్యాధునిక సాంకేతికత కలిగిన కార్పొరేట్ హాస్పిటల్స్ నెట్వర్క్ ఎక్కువ. అత్యాధునిక వైద్య పరికరాలు, మౌలిక వసతుల నిర్వహణ ఖర్చులు ఆటోమేటిక్గా పేషెంట్ బిల్లుపై పడుతుంది. పెద్ద పెద్ద హాస్పిటళ్లు, ఆధునిక సదుపాయాలు ఉన్న నగరాల్లో సాధారణ వ్యాధుల చికిత్సకు కూడా బిల్లులు చాలా ఎక్కువగా
ఉంటాయి.

టెస్టులు, స్కానింగ్ లే ఎక్కువ..

దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రైవేట్ హాస్పిటల్స్లో డిఫెన్సివ్ మెడిసిన్ (ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండేందుకు చేసే ఎక్కువ రకాల రక్త, ఇమేజింగ్ పరీక్షలు) అడ్వాన్స్డ్ స్కాన్లు (ఎంఆర్, పీఈటీ స్కాన్స్) ఎక్కువగా వాడుతారు.

  • బిల్లులో గది అద్దె, సర్జరీ మాత్రమే కాకుండా ఈ దయాగ్నోస్టిక్ ఖర్చులు పెరగడం వల్ల ఇన్సూరెన్స్ పరిమితులు దాటిపోతున్నాయి. దీంతో పేషెంటే సొంతంగా చెల్లించాల్సి వస్తున్నది.

మెడికల్ టూరిజం, ఎక్స్పర్ట్ డాక్టర్లు..

విదేశాల నుంచి కూడా రోగులు ఇండియాకు వస్తుంటారు. సూపర్-స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి హాస్పిటల్స్లో అనుభవజ్ఞులైన డాక్టర్ల కన్సల్టేషన్, సర్జరీ ఫీజులు భారీగా ఉంటాయి.

  • ఇన్సూరెన్స్ కంపెనీలు డాక్టర్ ఫీజుకు ఒక లిమిట్ నిర్ణయిస్తాయి. కానీ, కార్పొరేట్ హాస్పిటల్స్ డాక్టర్ ఫీజులు ఆ లిమిట్ కంటే ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే మొత్తానికి, హాస్పిటల్ చేసే బిల్లుకు మధ్య తేడా ఉంటుంది. ఎక్స్ ట్రా డబ్బులు రోగులే పే చేయాల్సి వస్తున్నది.

లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ..

దక్షిణాది రాష్ట్రాల్లో షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్, కిడ్నీ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ వ్యాధులు ఒక రోజులో నయమయ్యేవి. కావు. తరుచూ హాస్పిటల్స్కు వెళ్లాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే ఐసీయూలో కూడా అడ్మిట్ చేస్తారు. దీంతో ట్రీట్మెంట్ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. బీమా అవగాహన ఉన్నప్పటికీ.. దక్షిణాదిలో ఆదాయం కొంచెం ఎక్కువగా ఉండటంతో చాలామంది ప్రైవేట్ లేదా సింగిల్ రూమ్లను కోరుకుంటున్నారు. కానీ ఇన్సూరెన్స్ పాలసీలో రూమ్ రెంట్ పై క్యాపింగ్ ఉంటుంది. మనం ఎంచుకున్న గది అద్దె ఆ పరిమితిని దాటితే… కేవలం గది అద్దెలోనే కాకుండా డాక్టర్ ఫీజులు, ఐసీయూ చార్జీలలో కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కోతలు పెడుతుంది. దీంతో రోగి తన సొంత జేబు నుంచి ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తున్నది.

  • కొన్ని ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువమంది గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్తారు. పైగా అక్కడ పెద్ద పెద్ద ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఇంకా అంతగా రాకపోవడం వల్ల ట్రీట్మెంట్ ఖర్చులు తక్కువగా ఉంటాయి. అందుకే ఈ రాష్ట్రాల్లో ఒక కేసుకు అయ్యే సగటు ఖర్చు లెక్కల్లో తక్కువగా కనిపిస్తుంది.

హెల్త్ పాలసీల్లో లొసుగులు..

హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ వేల రూపాయలు తమ జేబు నుంచి చెల్లించాల్సి రావడానికి ఇన్సూరెన్స్ పాలసీలలోని నిబంధనలే ప్రధాన కారణం.

  • నాన్-మెడికల్ వస్తువులు: హాస్పిటల్ బిల్లులో వాడే గ్లోవ్స్, ప్లాస్టర్లు, సిరంజీలు, ప్యాడ్లు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు వంటి వస్తువులను ఇన్సూరెన్స్ కంపెనీలు రీయింబర్స్ చేయవు. • కవర్ కాని సేవలు: డాక్టర్ విజిటింగ్ ఫీజులు, నర్సింగ్ చార్జీలలో కొన్ని రకాల సర్వీసులు, అడ్మిషన్ ఫీజు, డిశ్చార్జ్ సమ్మరీ చార్జీలు, ఫైల్ ఫీజుల పేరిట వేసే బిల్లులను కంపెనీలు రిజెక్ట్ చేస్తాయి. ఇవన్నీ కలిపి చివరికి పెద్ద మొత్తంగా మారి రోగిపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి.
  • రూమ్ రెంట్ లిమిట్స్ చాలా పాలసీలలో
    సమ్ ఇన్ష్యూర్డ్ (మొత్తం బీమా)లో 1% మాత్రమే రోజువారీ గది అద్దెకు పరిమితిగా ఉంటుంది (ఉదాహరణకు రూ.5 లక్షల పాలసీకి రోజుకు రూ.5,000 మాత్రమే రూమ్ రెంట్).
  • కోపేమెంట్ నిబంధన: కొన్ని పాలసీలలో
    (ముఖ్యంగా సీనియర్ సిటిజన్ పాలసీలు లేదా నిర్దిష్ట నగరాల్లో తీసుకునే పాలసీలలో) 10% నుంచి 20% కో-పేమెంట్ నిబంధన ఉంటుంది.
  • మొత్తం బిల్లు రూ.2 లక్షలు అయితే ఇన్సూరెన్స్ కంపెనీ అంతా కవర్ చేసినప్పటికీ.. కో పేమెంట్ నిబంధన వల్ల రోగి తప్పనిసరిగా రూ.20వేల నుంచి రూ.40వేల వరకు సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది. వ్యాధుల వారీగా పరిమితులు: కంటికి శుక్లాలు, కిడ్నీ రాళ్లు, మోకాలి మార్పిడి, అపెండిక్స్ వంటి కొన్ని రకాల సాధారణ ఆపరేషన్లకు ఇన్సూరెన్స్ కంపెనీలు పరిమితి విధిస్తాయి. ఆపరేషన్కు రూ.1.5 లక్షలు ఖర్చయితే పాలసీ పరిమితి రూ.60,000 మాత్రమే ఉంటే.. మిగిలిన రూ.90వేలు రోగి జేబు
    చెల్లించాలి.
  • వెయిటింగ్ పీరియడ్: బీపీ, షుగర్, గుండె సమస్యలు ఉన్నవారు పాలసీ తీసుకున్న వెంటనే వాటికి సంబంధించిన అత్యవసర చికిత్సలకు క్లెయిమ్ లభించదు (2 నుంచి 4 ఏండ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది). ఈ సమయంలో హాస్పిటల్లో అడ్మిట్ అయితే రూపాయి కూడా ఇన్సూరెన్స్ నుంచి రాదు.

అదనపు ఖర్చుల దెబ్బ 20% నుంచి 40%

హాస్పిటల్ బిల్లులో మనకు కనిపించే వైద్య ఖర్చులు సగం మాత్రమే. నిజానికి హాస్పిటల్ పాలైనప్పుడు అయ్యే దాగి ఉన్న ఖర్చులు ఇంకో సగం ఉంటాయి. జర్నీలు, అటెండర్లకు తిండి, వసతి, ఉద్యోగానికి సెలవు పెట్టడం వల్ల వచ్చే నష్టం వంటి వైద్యర ఖర్చులను చాలామంది ముందుగా ఊహించలేరు. వీటిని కూడా లెక్కిస్తే ఒక కుటుంబంపై పడే నిజమైన ఆర్థిక భారం అసలు బిల్లు కంటే మరో 20% నుంచి 40% వరకు పెరుగుతుంది. వెళడానికి అంబులెన్స్రా కపోకలు, రోజూ ఆస్పత్రికి వెళ్లి రావడానికి అయ్యే క్యాబ్, పెట్రోల్ ఖర్చులు. హాస్పిటల్ రూమ్లో ఒకరికే అనుమతి ఉంటుంది. తోడుగా ఉండే కుటుంబ సభ్యులు బయట లాడ్జీల్లో ఉండాలి. రోజులు లేదా వారాల తరబడి హోటల్స్లోనే తింటారు. ఇంట్లో సంపాదించే వ్యక్తి హాస్పిటల్ పాలైతే ఆదాయం ఆగిపోతుంది. తోడుగా ఉండే కుటుంబ సభ్యులు కూడా ఉద్యోగానికి సెలవు పెట్టాల్సి ఉంటుంది. డిశ్చార్జ్ అయ్యాక వాడే మందులు, ఇంటి వద్ద ఫిజియోథెరపీ, నర్సింగ్ కేర్, బెడ్ వంటి పరికరాల అద్దెలు అదనం.

  • తెలంగాణలో సగటు వైద్య ఖర్చు రూ.46,316 ఉంటే… ట్రాన్స్ పోర్టేషన్, ఫుడ్, ఉపాధి నష్టం వంటి నాన్-మెడికల్ ఖర్చులు కలిపితే ఆ భారం ఈజీగా రూ.65,000 నుంచి రూ. 70,000 దాటుతుంది. అంటే హాస్పిటల్ బిల్లు ఎంత ఉందో.. దానికి దాదాపు సగం అదనంగా ఈ కనిపించని ఖర్చుల రూపంలో కుటుంబం భరించాల్నిందే.

పనికిరాని ప్రభుత్వ పథకాలు..

ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పూర్తి రిలీఫ్ లభించక సామాన్యులు అప్పుల పాలవుతున్నారు. ఈ పథకాల పరిమితులు, హాస్పిటల్స్ తీరు దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వ పథకాల ప్యాకేజీ ధరలు చాలా పాతవిగా ఉండటంతో ప్రైవేట్ హాస్పిటల్స్మ న ఇంప్లాంట్లు, ప్రత్యేక గదులు” పేరిట రోగుల నుంచి వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయి. ‘ కొన్ని పెద్ద ఆపరేషన్లు, క్యాన్సర్ లేదా కిడ్నీ వ్యాధులకు వాడే ఖరీదైన మందులు ఈ ప్రభుత్వ పథకాల జాబితాలో ఉండవు. దాంతో ఇలాంటి రోగాల బారినపడినప్పుడు ఉచిత వైద్యం వర్తించక, రోగులు తమ సొంత డబ్బులే ఖర్చు చేయాల్సి వస్తున్నది.

పెండింగ్ బిల్లులు.. ప్రైవేట్ హాస్పిటల్స్ నిరాకరణ

ప్రభుత్వం నుంచి వందల కోట్ల రూపాయల హెల్త్ కార్డ్ బిల్లులు ఏండ్ల తరబడి పెండింగ్లో ఉండటంతో ఎన్నో నెట్వర్క్ ఆసుపత్రులు ఫ్రీ ట్రీట్మెంట్ అందించేందుకు వెనుకాడుతున్నాయి. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ కింద వచ్చే రోగులకు “బెడ్లు ఖాళీగా లేవు’, ‘నెట్వర్క్ సరిగ్గా పనిచేయడం లేదు’ అని సాకులు చెప్పి ప్రైవేట్ క్యాష్ పేషెంట్లుగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. • హాస్పిటల్లో చేరిన తర్వాత చేసే స్కాన్లు, రక్త పరీక్షలను గవర్నమెంట్ స్కీమ్స్ కింద చూపకుండా బయట ల్యాబ్లలో సొంత ఖర్చుతో చేయించుకోమని చెప్తున్నాయి. డిశ్చార్జ్ తర్వాత వాడాల్సిన ఖరీదైన మందులను రోగులే బయట కొనాల్సి వస్తున్నది. అన్ని రకాల రోగాలకు ఉచిత వైద్యం అందించే ఎంపానెల్డ్ హాస్పిటల్స్ నగరాల్లోనే ఎక్కువగా ఉంటాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రయాణ ఖర్చులు, ఉండటానికి అయ్యే ఖర్చులు భరించలేక స్థానిక ప్రైవేట్ డాక్టర్ల వద్ద అప్పులు చేసి చికిత్స చేయించుకుంటున్నారు.

మెడికల్ ఇన్ఫ్లషన్..

ఇండియాలో నిత్యావసరాల ధరల కంటే వైద్య ఖర్చులు రెట్టింపు వేగంతో పెరుగుతున్నాయి. దేశంలో సాధారణ ద్రవ్యోల్బణం 5% నుంచి 6% వరకు ఉంటే.. మెడికల్ ఇన్షన్ ఏటా 14% వరకు పెరుగుతున్నది. ఇది సామాన్యులకు, మధ్యతరగతికి కోలుకోలేని దెబ్బగా మారింది.

నాణ్యత పేరిట చార్జీలు: వైద్య రంగం ఒక సేవా రంగం నుంచి కార్పొరేట్ వ్యాపారంగా మారింది. పెద్ద నగరాల్లో ఐసీయూ బెడ్ అద్దె, ఆపరేషన్ థియేటర్ చార్జీలు, కన్సల్టేషన్ ఫీజులను ఏడాదికేడాది ఆస్పత్రులు విపరీతంగా పెంచేస్తున్నాయి.

నియంత్రణ లేని డయాగ్నోస్టిక్స్: హాస్పిటల్లో చేరినప్పుడు వేసే ఎంఆర్ఎస్ఐ, సీటీ స్కాన్, ఇతర బ్లడ్ టెస్టుల ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేదు. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ సొంత ల్యాబ్లలోనే పరీక్షలు చేయించుకోవాలని నిబంధనలు పెట్టి అధిక రేట్లు వసూలు చేస్తున్నాయి.

కుటుంబం మొత్తంపై ప్రభావం..

కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం బారినపడితే అది కేవలం ఆరోగ్య సమస్యగా మాత్రమే మిగిలిపోదు.. ఆ కుటుంబాన్ని సామాజికంగా, ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల హాస్పిటల్ బిల్లులు కట్టడానికి ఆస్తులు అమ్ముకోవడం, అప్పులు చేయాల్సి వస్తున్నది. • ఇండియాలో ప్రతీ ఏటా దాదాపు 5 నుంచి 6 కోట్ల మంది ప్రజలు కేవలం హాస్పిటల్ ఖర్చుల వల్లే పేదరికంలోకి (దారిద్య్ర రేఖకు దిగువకు) జారిపోతున్నారు.

అప్పటి వరకు స్థిరంగా ఉన్న మధ్యతరగతి కుటుంబాలు కూడా ఒక్క పెద్ద వ్యాధి (క్యాన్సర్, గుండె ఆపరేషన్లు, ఐసీయూ అడ్మిషన్లు) వల్ల ఒక్కసారిగా నిరుపేదలుగా మారిపోతున్నాయి. • బిల్లులు చెల్లించడానికి కుటుంబాలు తమ వద్ద ఉన్న కొద్దిపాటి బంగారం అమ్మడం, ఇల్లు లేదా పొలం కుదువ పెట్టడం, లేదా వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులు తీర్చడానికి ఏండ్ల తరబడి కష్టపడాల్సి వస్తున్నది.

కార్పొరేట్ ఉద్యోగుల తరహాలో రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లకు కంపెనీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు. పైగా వీరు హాస్పిటల్ పాలైతే ఆదాయం ఆగిపోతుంది. ఒకవైపు హాస్పిటల్ బిల్లుల భారం, మరోవైపు రోజువారీ గడవడానికి కూడా డబ్బులు లేని దయనీయ స్థితి ఏర్పడుతుంది. ఇంట్లో పెద్దవారి వైద్యం కోసం సేవింగ్స్ మొత్తం ఖర్చయిపోవడంతో పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. చివరికి వీరు బాల కార్మికులుగా మారుతున్నారు.