హెల్త్ సెంటర్ సిబ్బంది పరుగో పరుగు

హెల్త్ సెంటర్ సిబ్బంది పరుగో పరుగు

  • ఘటన స్థలికి కమిషన్ చేరిక
  • షార్ట్ సర్క్యూటే కారణం

ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ : ఎమ్మిగనూరు పట్టణంలోని సంజీవనగర్(Sanjeevanagar) అర్బన్ హెల్త్ సెంటర్‌లో గురువారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌(electrical short circuit)తో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్నమున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి(Gangireddy) ఘటన స్థలాన్నిచేరుకొని అగ్నిమాపక(fire brigade) సిబ్బంది కి సమాచారం అందించారు.

మంటలను అదుపులో తీసుకున్నారు. సిబ్బందిని అడిగి కారణాలను తెలుసుకున్నారు. అర్బన్ హెల్త్ సెంటర్‌(urban health center)లోని కాటన్ రూల్స్, వ్యాక్సినేషన్ బాక్సులు ఉన్నగదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. దీనిపై సిబ్బందికి తగు జాగ్రత్తలు సూచించిన కమిషనర్ అర్బన్ సెంటర్ విద్యుత్ సర్క్యూట్‌కు గల కారణాలను తక్షణమే పరిశీలించి పునరుద్ధరణకు చర్య తీసుకుంటామన్నారు.

Leave a Reply