Health Center | సమయపాలన పాటించని వైద్యులు..

Health Center | సమయపాలన పాటించని వైద్యులు..
Health Center | బాసర, ఆంధ్రప్రభ : మండలంలోని ఏకైక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 10 గంటలు దాటిన వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో వచ్చిన రోగులను ఎవరు పట్టించుకోవడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుణ్యక్షేత్రం కొలువైన బాసరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దుస్థితి ఇలా ఉంటే మిగతా ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఎలా ఉంటుందోనని అర్థం చేసుకోవచ్చు. మేజర్ పంచాయితీ తోపాటు తొమ్మిది గ్రామాల ప్రజలు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపైనే ఆధారపడతారు.

దీనికి తోడు పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు సైతం ఏమైనా చిన్న సమస్యలు ఎదురైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తారు. 24 గంటల పాటు ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉంచితే ఇటు భక్తులకు మండల ప్రజలకు సకాలంలో వైద్యం అందించే వీలుంటుందని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్ లను నియమించాలని మండల వాసులు కోరుతున్నారు.

- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సర్పంచ్..
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సర్పంచ్ వెంకటేష్ గౌడ్ ఉప సర్పంచ్ సయ్యద్ అలీ కలిసి సందర్శించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని మెడికల్ ఆఫీసర్ సిద్ధికిని సర్పంచ్ సూచించారు. అందుబాటులోని అన్ని రకాల మందులు ఉంచుకోవాలని సూచించారు.

