సోంపేట (శ్రీకాకుళం జిల్లా), ఆంధ్రప్రభ : శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో.. బారువ సాగర తీరంలో.. తాబేళ్ల పండుగ కోలాహలం నెలకొన్న వేళ.. రెండవ రోజు.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఇక్కడి లివిన్ అడ్వెంచర్స్ మరువలేని బర్త్ డే గిప్ట్ ను అందించారు. చంద్రబాబకు బర్త్ డే విషెస్ తెలిపే బ్యానర్ తో .. సముద్రంలో 70 అడుగుల లోతులోకి దూసుకు వెళ్లిన స్క్యూబా డ్రెవర్లు .. అదే ప్రాంతంలో 112 ఏళ్ల కిందట మునిగిన ఓడను చేరుకుని చంద్రబాబు హ్యాపీ బర్త్ డే జండాను ఆవిష్కరించారు. లివిన్ అడ్డెంచర్స్ వ్యవస్థాపకుడు, మాజీ నేవీ ఉద్యోగి బలరాం నాయుడు ఈ వినూత్న శుభాకాంక్షలు తెలిపారు. రెండు రోజులుగా బారువా బీచ్ లో తాబేళ్ల పండుగ సందడి నెలకొంది.
కార్యక్రమంలో స్క్యూబా డ్రైవర్లు తమ విన్యాశాలతో ఆకట్టుకుంటున్నారు. ప్రత్యేక ఆకర్షణగా జన్మదినోత్సవం..సీఎం చంద్రబాబు 75వ జన్మదినం వేడుకలను బారువ తీరంలో ఆదివారం పర్యాటకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ నౌఖ ప్రమాదంలో వందలాది మంది నావికులను కాపాడిన ఈ బారువా బీచ్ చరిత్రకెక్కింది.
ఈ సందర్భంగా లివిన్ అడ్వెంచర్స్ అధినేత బలరాంనాయుడు స్క్యూబా డ్రైవింగ్లో మునిగిన పడవ ప్రాంతానికి చేరుకుని జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆ ఓడ ప్రమాదాన్ని ఇక్కడి మత్స్యకారులు గుర్తు చేసుకున్నారు. 1913లో మద్రాస్ నుంచి రంగూన్ వెళ్తున్న ఓడలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులను బారువా తీరంలోని మత్స్యకారులు రక్షించారు.
కానీ ఆ నౌక సముద్రంలో మునిగిపోయింది. 2019లో స్క్యూబా డ్రైవింగ్ చేస్తూ లివెన్ అడ్వెంచర్స్ ఇక్కడ సముద్రంలో మునిగిన ఓడ ను గుర్తించారు. ఈ వీడియోలను బయటకు విడుదల చేశారు బారువ పర్యాటక కేంద్రం గా అభివృద్ధి చెందడానికి స్కూబా డైవర్లకు ఈ ఓడ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఇంత నేపథ్యం కలిగిన ఈ ఓడ ను చేరి సీఎం చంద్రబాబుకు థ్రిల్లింగ్ బర్త్ డే విషెస్ అందించటం విశేషం .