పహల్గామ్ రక్తదారులు మరిచారా..!

పహల్గామ్ రక్తదారులు మరిచారా..!

  • మహిళల సింధూరం చెరిపిన దేశంతో ఆటనా..?
  • శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూస శ్రీనివాస్

యాదాద్రి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : దుబాయ్ కేంద్రంగా జరుగుతున్నఆసియా కప్‌(Asia Cup)లో భాగంగా భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ ఆడటం సిగ్గు చేటని, ‘మహిళల సింధూరం చెరిపిన దేశంతో క్రికెట్ ఆడటం అన్యాయమని, పహల్గామ్(Pahalgam) రక్తదారులు మరిచారా.?

మోదీజీ అంటూ పాకిస్థాన్లో(Pakistan) క్రికెట్ ఆడవద్దని శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూస శ్రీనివాస్ విమర్శించారు. భువనగిరి పట్టణ కేంద్రంలో ఉద్దవ్ థాకరే ఆదేశానుసారం నిరసన కార్యక్రమాన్నినిర్వహించారు.

ఉగ్రవాదులను(terrorists) పెంచి పోషిస్తూ భారతదేశంలో ఆడుగడుగునా దేశ భక్తులను బాంబులతో భయపెడుతున్నపాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటం దేశంలో మహిళలను, క్రీడాకారులను అవమాన పర్చినట్టుందని, అమిత్ షా(Amit Shah) కొడుకు కోసం, ఆర్థిక లావాదేవీల కోసం దేశాన్ని, దేశ గౌరవాన్నిపణంగా పెడుతున్నారని విమర్శించారు.

జమ్ము- కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాదులు ఏప్రిల్ 22న వందలాది మంది మహిళల సింధూరాన్నిచెడిపిన దేశంతో క్రికెట్ ఆడటం అవసరమా..? అని ఈ మ్యాచ్‌ను బహిష్కరణ(boycott) చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నమిలె శేఖర్, బసంతినేశ్వర్, నల్లమాసు స్వామి, యాదమ్మ, శివ, నర్సింహ, భూపాల్ యాదవ్, వెంకటేష్, వంజగి కిషన్, భరత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply