సీఈఐఆర్‌ సాంకేతికతతో సెల్‌ఫోన్‌ రికవరీ

హసన్‌పర్తి, ఆంధ్రప్రభ: హసన్‌పర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సీఈఐఆర్‌ సాంకేతికత సహాయంతో రికవరీ చేసిన మొబైల్‌ ఫోన్‌ను ఇన్‌స్పెక్టర్‌ ఎ. మహేందర్‌ బాధితుడికి అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 30న ఎన్‌. ప్రశాంత్‌ అనే వ్యక్తి తిరుపతిలో తన మొబైల్‌ ఫోన్‌ను పోగొట్టుకున్నారు. ఈ మేరకు హసన్‌పర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఈఐఆర్‌ ఆపరేటర్‌ ఎం. సోమన్న, క్రైమ్‌ పార్టీకి చెందిన కె. తిరుపతి సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మొబైల్‌ ఫోన్‌ తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు.

దీంతో హసన్‌పర్తి క్రైమ్‌ పార్టీ పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని తిరుపతి నుంచి మొబైల్‌ ఫోన్‌ను కొరియర్‌ ద్వారా హసన్‌పర్తి పోలీస్‌ స్టేషన్‌కు తెప్పించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫోన్‌ను బాధితుడు ఎన్‌. ప్రశాంత్‌కు అప్పగించారు. తన మొబైల్‌ ఫోన్‌ను రికవరీ చేసి అప్పగించిన పోలీసులకు ప్రశాంత్‌ కృతజ్ఞతలు తెలిపారు.