Hanuman Ansh Telugu |’హనుమాన్ అంశ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆడియన్స్ ఎంతోగానో మెచ్చకున్న డివైన్ కాన్సెప్ట్ హిందీ మూవీ ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. ఈ సినిమాను తెలుగులో వరల్డ్‌వైడ్‌గా అక్టోబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తుండటం విశేషం.
హనుమంతుడి దైవత్వం బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా కథ ఇప్పటికే చాలామందిని ఆకట్టుకుంది. శోభినా సత్య, విహాన్ శెడ్గే మెయిన్ రోల్స్ లో నటించగా, విశాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్వాంభూ మీడియా ఈ సినిమాను గ్రాండ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించింది. చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి, ఏకే రాస్తోగి, గుల్షన్ పాండే ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా విజువల్స్, పోస్టర్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
సినిమాలో స్పిరిచువల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయంట. ఈ సినిమాను ఇంటర్నేషనల్ వైడ్‌గా పివిఆర్ సినెపోలిస్, ఫార్స్ ఫిలింస్ లాంటి పెద్ద సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. అక్టోబర్ 9న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
