మహిళకు అప్పగింత..
ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఉట్నూరు నుండి ఆదిలాబాద్(Adilabad) వస్తున్నఆర్టీసీ బస్సులో ఓ మహిళా ప్యాసింజర్ లేడీ పర్సును మర్చిపోయింది. ఆదిలాబాద్ డిపోకు చెందిన బస్సు (ఏపీ 31 జెడ్ 0013)లో మహిళా ప్యాసింజర్(Passenger) పోగొట్టుకున్నపర్సును బస్సు కండక్టర్(Conductor) స్వామి డిపో మేనేజర్ ప్రతిమారెడ్డికి అప్పగించి నిజాయితీ చాటుకున్నారు.
గుడిహత్నూర్(Gudihatnur) మండలం సీతా గొందికి చెందిన సురయ అనే మహిళ ప్యాసింజర్ బస్సులో తన పర్సు పోయిందని ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే కండక్టర్ ఇచ్చిన పర్సులో ఉన్నరూ. 32 వేల నగదు, 2.5 గ్రాముల బంగారు నగలను ఆ మహిళకు డిపో మేనేజర్ ప్రతిమ(Depot Manager Pratima) అందజేశారు. ఈ సందర్భంగా పర్సు, నగదు, బంగారం అప్పగించిన కండక్టర్ స్వామి నిజాయితీ ప్రశంసిస్తూ శాలువా కప్పి సన్మానించారు. బాధితురాలు కండక్టర్ స్వామి నిజాయితీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

