జ్ఞానేశ్ కుమార్ ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మరో పర్యటన వాయిదా వేసుకున్నారు. ఈ విషయం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ప్రకటించింది.
కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఫామ్-6లో మార్పులపై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఈసీ అభిప్రాయబేధాలు, సర్ వివాదాల తర్వాత.. మీరట్, వారణాసి, లడఖ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ పర్యటనలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ ఆ జాబితాలో చేరింది. అయితే ఆయన పర్యటనల్లో నిరసనలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనే చర్చా సాగుతోంది. ఇదిలా ఉంటే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌పై బుధవారం కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగనున్నాయి. ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి నిరసనలో పాల్గొంటామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.
