Guntur | ఘ‌నంగా జననేత జన్మదినం

Guntur | ఘ‌నంగా జననేత జన్మదినం

  • మాజీ మంత్రి మేకతోటి సుచరిత
  • మాజీ హోం మంత్రి సుచరిత కార్యాలయంలో వైసీపీ శ్రేణుల సంబరాలు
  • కేక్ కటింగ్… బాణాసంచా వెలుగుజిలుగుల్లో యువత కేరింత

Guntur | గుంటూరు, ఆంధ్రప్రభ : గుంటూరు బ్రాడీపేటలోని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. భారీగా బాణాసంచా కాల్చి వెలుగుజిలుగులతో హోరెత్తించారు. మేకతోటి సుచరిత దయాసాగర్ మిత్రమండలి ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా మేకతోటి దయాసాగర్, సుచరిత దంపతులు జన్మదిన వేడుకలకు వచ్చిన వైసీపీ నాయకుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply