గుమ్మనూరులో రాజకీయ ఘర్షణ.. రణరంగంగా మారిన గ్రామం

బీజేపీ, టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య పరస్పర దాడులు
ఇరువురికి తీవ్ర గాయాలు.. పలువురికి గాయాలు
కొందరి పరిస్థితి విషమం

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలోని గుమ్మనూరు గ్రామంలో రాజకీయ ఉద్రిక్తత తీవ్ర ఘర్షణకు దారితీసింది. బీజేపీ, తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య పరస్పర దాడులు చోటుచేసుకోవడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలు కాగా, పలువురు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మూడు పార్టీలకు చెందిన వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదం క్రమంగా తీవ్రరూపం దాల్చి దాడులకు దారితీసినట్లు తెలుస్తోంది. పరస్పరం దాడులకు దిగడంతో పలువురు గాయాలపాలయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనతో గుమ్మనూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణకు దారితీసిన కారణాలు, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.