AP | చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్‌ విమర్శలు..

కుటుంబాలను విడదీసే చరిత్ర సీఎం సొంతం అంటూ ఆరోపణ


AP | విజయనగరం, ఆంధ్రప్రభ : సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్‌ తీవ్ర విమర్శలు చేశారు. విజయనగరం జిల్లాలో జరిగిన వైసీపీ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు కుటుంబాలను విడదీసే చరిత్ర ఉందని ఆరోపించారు.

బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని ఎవరూ తాకలేరని, ఆయన ఒక రాజకీయ విశ్వవిద్యాలయం లాంటి వ్యక్తి అని గుడివాడ అమర్నాథ్‌ పేర్కొన్నారు. బొత్స కుటుంబానికి ప్రత్యేక రాజకీయ గుర్తింపు ఉందన్నారు.

మరోవైపు మంత్రి నారా లోకేశ్‌ చుట్టూ తిరిగే అధికారుల పరిస్థితి భవిష్యత్తులో మారవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు, వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అయితే మళ్ళీ భావోద్వేగానికి గురైన బొత్స సత్యనారాయణ కన్నీళ్లు పెట్టుకున్నారు. వైసీపీ జిల్లా సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.