మంత్రి వాకిటి అండతో గుడిగండ్ల గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

  • ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్‌గా గెలిపించండి: కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్

మక్తల్, ఆంధ్రప్రభ : మంత్రి డా. వాకిటి శ్రీహరి అండతో గుడిగండ్ల గ్రామంని సమగ్ర అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్నికల్లో తనను ఆదరించి, సర్పంచ్‌గా గెలిపించాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

శనివారం, గుడిగండ్ల గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను గెలిపితే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు.

గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని కోరుతూ, మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో ప్రతి సమస్యకు పరిష్కారం తీసుకువచ్చే హామీ ఇచ్చారు. అలాగే, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు.

శ్రీనివాస్ గౌడ్, రాజకీయాలకు మించిపోయి గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు తీసుకువచ్చి గుడిగండ్ల గ్రామ రూపురేఖలను మార్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే, గ్రామం సర్వతోముఖ అభివృద్ధి పొందుతుందని, ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి అండగా నిలవాలని గ్రామస్తులను కోరారు.

Leave a Reply