Group-3 | రైతు కుటుంబంలో పుట్టి…

Group-3 | రైతు కుటుంబంలో పుట్టి…
Group-3 | మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ కు చెందిన నిరుపేద విద్యార్థి బి.రమేష్ గ్రూప్-3(Group-3) ఫలితాల్లో ప్రతిభ చాటాడు. పౌర సంబంధాల శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టును సాధించాడు. పట్టణానికి చెందిన పొద్దుబోయ శామయ్య , కమలమ్మ కుమారుడు బి. రమేష్ టెన్త్ వరకూ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే(government schools ) చదువుకున్నాడు.
ప్రతిభ పరీక్షలు ఎప్పుడు జరిగిన మండల, జిల్లా ,రాష్ట్ర స్థాయిలో (వ్యాస రచన ,క్విజ్) పోటీల్లో మొదటి స్థానం సాధించడం రమేష్ సొంతం. పదవ తరగతి చదువుతున్న సమయంలో రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం(first place) సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. పదవ తరగతి వార్షిక పరీక్షల్లోను 9.5 సాధించి మండల టాపరుగా నిలిచాడు. దీంతో స్థానికంగా ఉన్ వివేకానంద జూనియర్ కళాశాల యాజమాన్యం ఇంటర్ పూర్తిగా ఉచితంగా అందించారు.
ఇంటర్ తర్వాత నీట్‌లో ర్యాంకు సాధించిన ఆయన సిరిసిల్లలో అగ్రికల్చర్(Agriculture) బీఎస్సీ చేశాడు. ఖాళీ సమయాల్లో పొలం పనుల్లో సహాయపడుతూనే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. రాష్ట్ర పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో హెచ్ ఓ డి వద్ద జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బి.రమేష్ మాట్లాడుతూ సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని అన్నారు.
