ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామంలో గురువారం ప్రభుత్వం ద్వారా రెండో విడతలు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి స్థానిక సర్పంచ్ దుమాల మమత (రాజు) ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులకు కలిసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మొగ్గు పోసి ప్రారంభించడం జరిగిందని అన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సహకరించిన బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ కు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ…. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ వినయ్, ఏఎంసీ డైరెక్టర్ నరసాపురం జీవన్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆర్మూర్ రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూతుల రమేష్,ఆడపా రాజేశ్వర్, నూతుల వసంత్ రెడ్డి, శోభన్ గౌడ్, తూర్పు శ్రీధర్, ఆనంద్ గౌడ్, చేవ్వ ప్రశాంత్, బాబాగౌడ్, ప్రశాంత్ గౌడ్, గిర్ణి నర్సారెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
