లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఖైదీ సినిమా ఘన విజయాన్ని సాధించి, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్సీయూ)కి బాటలు వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన విక్రమ్, లియో కూడా సూపర్ హిట్స్‌గా నిలవడంతో, ఖైదీ 2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ముఖ్యంగా తమిళంతో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ.. కూలీ తరువాత ఖైదీ 2 సెట్స్‌పైకి వెళ్తుందని చెప్పినప్పటికీ, తాజా పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్‌కి ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది.
కారణం ఏమిటంటే… ఖైదీ 2కి ముందే లోకేష్ ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో లెజెండరీ యాక్టర్స్ రజనీకాంత్, కమల్ హాసన్‌లను ఒకే తెరపైకి తీసుకురావాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నాడని కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
ఓపైపు కూలీ సినిమా మిశ్రమ స్పందనతో థియేటర్లలో భారీ కలెక్షన్లు రాబడుతున్న వేల… రజనీ-కమల్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ సినిమా వస్తుందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలోనే లోకేష్, “రజనీకాంత్-కమల్‌తో డ్యూయల్ హీరో ఫిల్మ్ చేయాలనుకున్నాను, ఇద్దరూ ఆసక్తి చూపారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది” అని చెప్పాడు. ఇప్పుడు ఆ కల నిజం కాబోతుందనే బలమైన టాక్ వినిపిస్తోంది.
సమాచారం ప్రకారం, ఈ సినిమా ఇద్దరు వృద్ధ గ్యాంగ్‌స్టర్స్ చుట్టూ తిరిగే స్టోరీతో, డ్యూయల్ హీరో ఫార్మాట్‌లో రూపొందనుంది. తెలుగు ప్రేక్షకులకూ రజినీ-కమల్ కాంబినేషన్ అంటే క్రేజ్ ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. అన్ని అనుకూలిస్తే, ఈ సినిమా 2026లో సెట్స్ మీదకు వెళ్లి, 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.