Green Signal | ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
Green Signal | అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మార్పులతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరగనుంది.
క్యాబినెట్ నిర్ణయాల మేరకు:
- అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లా కేంద్రంగా మార్చడం.
- రాజంపేటను కడప జిల్లాలో కలపడం.
- రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో చేర్చడం.
- గూడూరును తిరుపతి నుంచి నెల్లూరు జిల్లాలో కలపడం.
- కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు.
ఈ పునర్విభజనతో పరిపాలన మరింత సమర్థవంతమవుతుందని, ప్రజలకు సేవలు సమీపంగా అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దు మార్పులు త్వరలోనే అధికారిక ఉత్తర్వుల ద్వారా అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

