జనసేన నాగబాబుకు పదవి లభించడం హర్షణీయం
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: జనసేన పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు రాష్ట్ర గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నియమితులవడం పట్ల ఆ పార్టీ కొండపల్లి పట్టణ అధ్యక్షుడు చెరుకుమల్లి సురేష్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం నాగబాబును మర్యాదపూర్వకంగా కలిసిన సురేష్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో నాగబాబు మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, రాష్ట్ర అభివృద్ధికి తన సేవలు అందించాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి వంటి కార్యక్రమాలను నాగబాబు సమర్థవంతంగా అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
