ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం..
మరిపెడ, ఆంధ్రప్రభ : గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని మరిపెడ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్రెడ్డి పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి మెమెంటోలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి అనితాదేవి, వైస్ చైర్పర్సన్ కాలం సునీత రవీందర్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
