అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా శ్రావణ్‌ కుమార్‌కు పదోన్నతి

  • జెడ్పీ పాఠశాలలో ఘనంగా సన్మానం

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌కు చెందిన రాథోడ్‌ శ్రావణ్‌ కుమార్‌ ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైన్స్‌–హిందీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందడం గర్వకారణమని ఉట్నూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాదవ్‌ రమేష్‌, ఉపాధ్యాయులు అన్నారు. పదోన్నతి పొందిన అనంతరం తొలిసారిగా పాఠశాలను సందర్శించిన శ్రావణ్‌ కుమార్‌ను శనివారం పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఉట్నూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసిన శ్రావణ్‌ కుమార్‌ అంచెలంచెలుగా ఎదిగి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

విద్యారంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి విద్యార్థులకు సేవలందించాలని ఆకాంక్షించారు. తనను సన్మానించిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు శ్రావణ్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జాదవ్‌ రమేష్‌, ఉపాధ్యాయులు కృష్ణ, రాజేందర్‌, దత్తారం, నగేష్‌, గోపాల్‌, సవిత తదితరులు పాల్గొన్నారు.