లలిత కళాతోరణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

  • మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి వేడుకల్లో పాల్గొన్న మంత్రి
  • పర్యాటక శాఖ రూపొందించిన ప్రత్యేక బతుకమ్మ పాటలు ఆవిష్కరణ

హైదరాబాద్‌ , (ఆంధ్రప్రభ) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సహచర మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పాల్గొని బతుకమ్మ సంబరాల్లో భాగస్వామ్యం అయ్యారు.

ఈ సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన బతుకమ్మ పాటలను ఆవిష్కరించారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, రాష్ట్ర సంస్కృతి వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.