TG | ‘ఫోన్‌పే’ తరహాలో ‘గ్రామ్‌పే’.. ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు..

హైదరాబాద్ : డిజిటల్ ఆర్థిక సమగ్రతను మరింత విస్తరించే దిశగా, తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ & కామర్స్, శాసన వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్ బాబు గ్రామ్‌పే ను అధికారికంగా ప్రారంభించారు. సెమీ-అర్బన్, గ్రామీణ భారతదేశంలోని లక్షలాది మందికి ఆర్థిక సేవలను అందించడానికి వీయోనా ఫిన్‌టెక్ గ్రామ్ పేను అభివృద్ధి చేసింది.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను విస్తరించేందుకు సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. “గ్రామ్‌పే భారతదేశ డిజిటల్, ఆర్థిక సమగ్రత లక్ష్యానికి దారితీసే విప్లవాత్మక ఆవిష్కరణ. డిజిటల్ చెల్లింపులు, గ్రామీణ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా, గ్రామీణ ప్రజలకు ఆర్థిక సేవలు చేరువ కావడం మాత్రమే కాకుండా, అవి వారికి హక్కుగా మారతాయి,” అని ఆయన అన్నారు.

Leave a Reply