grain purchase | పత్తి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి…
- జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
grain purchase | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిది, ఆంధ్రప్రభ : వరి, పత్తి, మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్(Conference) సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్, ఐకేపి, సహకార శాఖల అధికారులలతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో వరి ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లు పై సమీక్షించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం కు వచ్చిన వెంటనే నాణ్యతా ప్రమాణాలు, తేమ శాతం ఉన్న ధాన్యం కాంటా వేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు(grain purchase) చేసి మిల్లుకు పంపించాలని సూచించారు. మిల్లర్లు వచ్చిన ధాన్యమును వెంటనే దిగుమతి చేసుకొని ఓపిఎంఎస్ లో అంగీకరిస్తేనే రైతులకు మద్దతు ధర విడుదల చేయడానికి ఉంటుందని, కాబట్టి మిల్లర్లందరూ చర్యలు సుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కొనుగోళ్లలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
పత్తి కొనుగోళ్లపై సమీక్షిస్తూ, పత్తి 7 క్వింటాళ్ల పై దిగుబడి ఉంటే రైతు వ్యవసాయ విస్తరణ అధికారి ధృవీకరించిన సర్టిఫికెట్ తో కొనుగోలుకు తీసుకురావాలని తెలిపారు. మొక్క జొన్న కొనుగోళ్ల పై సమీక్షించి వేగంగా కొనుగోళ్ళు చేయాలని, సంబంధిత అధికారులు కొనుగోలు కేంద్రాలు సందర్శించి సమస్యలు ఉంటే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహారావు, పౌరసరఫరాల సంస్థ డిఎం రాజేందర్, జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు, జిల్లా సహకార అధికారి, డిఆర్డీఓ చిన్న ఓబులేసు, మార్కెటింగ్ అధికారి తదితరులు పాల్గొన్నారు.


