Graduate | అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేస్తాం..
Graduate | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం నాగారం గ్రామంలో ఓటర్ల అవకాశం కల్పిస్తే గ్రామం అభివృద్ధితో పాటు, గ్రామంలోని యువతకు అండగా నిలబడతానని నాగారం గ్రామ బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాచబోయిన రవళి క్రాంతికుమార్ అన్నారు.
సర్పంచ్ అంటే స్ట్రీట్ లైట్స్(Street lights) పెట్టించడం, డ్రైనేజీ క్లీన్ చేయించడం, రోడ్లు క్లీన్ చేపించడానికే పరిమితం కాకుండా, టెంపరరీ నిర్ణయాలు కాకుండా గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్దామన్నారు. ఒక గ్రాడ్యుయేట్(graduate) మహిళా సర్పంచ్ గా గెలిపిస్తే అభివృద్ధి పనులు చేపడతానని అన్నారు.

