Govt School | అభివృద్ధి ప‌నులు ప‌ర్య‌వేక్షించాలి…

Govt School | అభివృద్ధి ప‌నులు ప‌ర్య‌వేక్షించాలి…

Adilabad | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల(Govt School)లో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసే విధంగా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(Koya Shri Harsha) అన్నారు. ఈ రోజు పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో పాఠశాలల పర్యవేక్షణ, ప్రభుత్వ బ్యాంక్ ఖాతాల నిర్వహణ పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ శాఖలలో వినియోగించని బ్యాంకు ఖాతాలలో జమ చేసి ఉన్న ఆర్ బీఐ(RBI) నుంచి వెనక్కి తీసుకునేందుకు కేవైసీ వివరాలు, రిక్వెస్ట్ లెటర్(request letter) సంబంధిత శాఖలు అందించాలని కలెక్టర్ సూచించారు. నవంబర్ 22 నాటికి పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ శాఖల పరిధిలో ఉపయోగించని బ్యాంకు ఖాతాల నుంచి ఆర్ బీఐ ఫ్రీజ్ చెసిన డబ్బులు వెనక్కి తీసుకునేందుకు కార్యచరణ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

డిసెంబర్ చివరి నాటికి పెద్దపెల్లి జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో అవసరమైన మౌలిక వసతుల పనులు పూర్తి చేసే దిశగా నిధులు మంజూరు చేయడం జరిగిందని, కలెక్టరేట్ నుంచి దాదాపు 30 కోట్ల నిధులు(30 crore funds) మంజూరు చేసి పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టామన్నారు. ప్రతి జిల్లా అధికారికి రెండు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించాలని, రాబోయే 5 సంవత్సరాలకు సంబంధించి పాఠశాలలో అవసరమైన మేర అభివృద్ధి పనులు జరిగేలా చూడాలని, పాఠశాల అవసరాలకు ఇంకా ఏమైనా పనులు చేపట్టాల్సి ఉంటే ప్రతిపాదనలు అందించాలని అవసరమైన నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply