రేపు కర్నూలులో గవర్నర్ పర్యటన

రేపు కర్నూలులో గవర్నర్ పర్యటన
ఆర్ యు కాన్వికేషన్ హాజరు
పలు కార్యక్రమాల్లో పాల్గొన నున్న గవర్నర్
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ (S.Abdul Nazeer), సిబ్బంది, అధికారులతో కలిసి రేపు (బుధవారం, నవంబర్ 12, 2025) కర్నూలు జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఉదయం 9.35 గంటలకు విజయవాడ(Vijayawada) లోని రాజ్ భవన్ నుంచి గవర్నర్ రహదారి మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరుతారు. 9.55 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం 10.00 గంటలకు ప్రత్యేక విమానంలో కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ నరసింహరెడ్డి విమానాశ్రయానికి బయల్దేరుతారు.
10.30 గంటలకు కర్నూలు (Kurnool) విమానాశ్రయానికి చేరుకుని, కొద్ది సేపు విశ్రాంతి అనంతరం 10.35 గంటలకు రహదారి మార్గంలో రాయలసీమ విశ్వవిద్యాలయానికి వెళ్తారు. 10.50 గంటలకు రాయలసీమ యూనివర్సిటీకి చేరుకుని, 11.00 గంటల నుండి 12.15 గంటల వరకు విశ్వవిద్యాలయం నాలుగవ కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
తరువాత 12.20 గంటలకు రాయలసీమ యూనివర్సిటీ నుంచి ఇండస్ క్యాంపస్‌లోని మాంటిస్సోరి ఇండస్ రెసిడెన్షియల్ స్కూల్ కు బయల్దేరుతారు. 12.35 గంటలకు అక్కడికి చేరుకుని 2.20 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటూ భోజనం చేస్తారు.
తదుపరి 2.30 గంటలకు ఏ-క్యాంప్‌లోని మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్‌కు చేరుకుని 3.30 గంటల వరకు మాంటిస్సోరి సంస్థల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు.
3.35 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి 4.05 గంటలకు కర్నూలు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి విమానాశ్రయానికి చేరుకుంటారు. కొద్ది సేపు విశ్రాంతి అనంతరం 4.10 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరుతారు.
4.40 గంటలకు గన్నవరం (Gannavaram) విమానాశ్రయానికి చేరుకుని, చిన్న విరామం అనంతరం 4.45 గంటలకు రహదారి మార్గంలో విజయవాడ రాజ్ భవన్‌కి బయల్దేరి, 5.05 గంటలకు రాజ్ భవన్‌కు చేరుకుంటారు. ఈ పర్యటనలో గవర్నర్ రాయలసీమ విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ వేడుకతో పాటు.. మాంటిస్సోరి విద్యాసంస్థల స్వర్ణోత్సవంలో గవర్నర్ పాల్గొననున్నారు.
