క్రీడా రంగానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
చిట్యాల, ఆంధ్రప్రభ: ప్రభుత్వం విద్య , క్రీడారంగాలకు ప్రత్యేక కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ ఉన్నత పాఠశాలలో సీసీసీఎల్ 3 క్రికెట్ క్రీడలు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు.
ఎమ్మెల్యే మొదట బ్యాటింగ్ చేసి క్రీడాకారులను అబ్బురపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం చదువుతోపాటు క్రీడారంగంలో విద్యార్థులు గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగేలా కృషి చేస్తుందన్నారు. క్రీడాభివృద్ధి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి క్రీడాకారులకు సముచిత స్థానం కల్పిస్తానన్నారు. మండల కేంద్రంలో క్రీడల అభివృద్ధికి స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చల్లగరిగ గ్రామ సర్పంచ్ సిరిపెల్లి జంపయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దబ్బెట అనిల్, జిల్లా, మండల నాయకులు, పులి తిరుపతిరెడ్డి, దొడ్డి కిష్టయ్య, బుర్ర లక్ష్మణ్ , మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, గుంటుపల్లి నాగమల్లేశ్వరరావు, మాజీ ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
