Government | డయల్ 100ను విరివిగా వినియోగించుకోవాలి…

Government | డయల్ 100ను విరివిగా వినియోగించుకోవాలి…

  • యువత, వృద్ధులు గంజాయికీ దూరంగా ఉండాలి
  • అత్యవసర సమయంలో 100కు కాల్ చేయాలి
  • పోలీస్ మీకోసం కార్యక్రమంలో 500 దుప్పట్లు పంపిణీ

Government | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఆదివాసీలు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదగాలి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్. అన్నారు. ఈ రోజు మార్ముల కోలం ఆదివాసి గ్రామమైన పాటగూడాలో అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పోలీస్ మీకోసం(Police for you) అనే కార్యక్రమంలో భాగంగా 500 దుప్పట్ల పంపిణీ చేసీ, ఆదివాసి గ్రామాలలో ప్రజలు, యువత గంజాయికి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలఅన్నారు. పోలీసులు మీకోసంలో భాగంగా 500 దుప్పట్లను ఉచితంగా పంపిణీ చేశారు.

పాల్గొన్న ఎనిమిది గ్రామాల ప్రజలు…

Government |

త్వరలోనే యువతకు జాబ్ మేళా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 100ను విరివిగా వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి వైద్య సమస్యలకైనా ప్రభుత్వ ప్రైవేటు, వైద్యులను సంప్రదించాల‌నీ, మారుమూల ఆదివాసి గ్రామ ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు మెరుగుపరచాలని ఇంద్రవెల్లి మండలం పాటగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ పోలీస్ మీ కోసం కార్యక్రమానికి పరిసర గ్రామాల ఆదివాసులు పాల్గొని విజయవంతం చేశారు.

Government |

మొదటగా జిల్లా ఎస్పీ, ఉట్నూర్ అదనపు ఎస్పీ లకు ఆదివాసీలు డప్పు వాయిద్యాల నడుమ, సాంప్రదాయాలతో స్వాగతం పలికారు. తదుపరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఆదివాసి ప్రజలు చదువుపై ప్రాధాన్యత కేటాయించి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

కొడుకును కూతురును ఒకే విధంగా చూస్తూ సమాన విద్య అవకాశాలను ఇస్తూ ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఐపీఎస్, ఉట్నూరు సిఐ ఎం ప్రసాద్, ఇంద్రవెల్లి ఎస్ఐ ఈ సాయన్న, నూతనంగా ఎంపికైన సర్పంచులు, గ్రామ పటేల్, గిరిజనులు కోలం జాతి వారు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply