RTC-Metro common pass: మంత్రి పొన్నం ప్రభాకర్ కీల‌క‌ ప్రకటన

RTC-మెట్రో కామన్ పాస్ ఛార్జీల పునఃసమీక్షకు
మంత్రి పొన్నం ప్రభాకర్ కీల‌క‌ ప్రకటన
కామన్ పాస్ ధరలు అధికంగా ఉన్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు
త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం: మంత్రి పొన్నం ప్రభాకర్
సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఛార్జీలపై పునఃసమీక్ష: పొన్నం
ప్రజలపై అదనపు ఛార్జీల భారం మోపడం ప్రభుత్వ లక్ష్యం కాదు: పొన్నం
RTC-మెట్రో సేవలు మరింత విస్తృతంగా వినియోగించుకునేలా చర్యలు: పొన్నం
త్వరలోనే కామన్ పాస్ ధరలపై తుది నిర్ణయం: పొన్నం

RTC-Metro common pass: హైదరాబాద్‌ లో ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు అధికంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు. సామాన్య ప్రయాణికులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు కామన్ పాస్ ఛార్జీలను పునఃపరిశీలించనున్నట్లు ఆయన ఎక్స్ వేదిక‌గా వెల్లడించారు.

ప్రస్తుత ధరలపై పునరాలోచన: ప్రస్తుతం నిర్ణయించిన కామన్ పాస్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రోజువారీ కామన్ పాస్: రూ. 400 (మెట్రో వాటా: రూ. 300 | ఆర్టీసీ వాటా: రూ. 100)
నెలవారీ కామన్ పాస్: రూ. 8,500 (మెట్రో వాటా: రూ. 7,000 | ఆర్టీసీ వాటా: రూ. 1,500)

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు ప్రజల వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఛార్జీల సమీక్షకు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఆర్టీసీ, మెట్రో ఉన్నతాధికారులతో సమావేశమై సామాన్యులకు అందుబాటులో ఉండేలా సరసమైన ధరలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రజలపై అదనపు భారం మోపడం ప్రభుత్వ లక్ష్యం కాదని, ప్రజా రవాణా వ్యవస్థను (RTC & Metro) ప్రజలు మరింత విస్తృతంగా, సౌకర్యవంతంగా వినియోగించుకునేలా చేయడమే తమ ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు.