అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం బోల్గట్‌పల్లి గ్రామ పంచాయతీలో స్థానిక ప్రజలు ఏకస్వరం పలకడంతో కొత్త ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు. సర్పంచ్ పదవికి నేనావత్ పార్వతి గోపాల్ నాయక్ ఏకగ్రీవంగా ఎంపిక కావడం గ్రామంలో ఆనందాన్ని రేకెత్తించింది. గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, యువత ప్రతినిధులు పార్వతిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఉప సర్పంచ్‌గా దయాల చిన్న లింగమయ్య ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు. వార్డు సభ్యులుగా ఎన్నికైన సభ్యులు కూడా తమ గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని హామీ ఇచ్చారు.

