యువకుడు మృతి

గూడూరు, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నర్సంపేట నుంచి మహబూబాబాద్ వైపు ఎర్రమట్టి లోడుతో వెళ్తున్న లారీ గూడూరు మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గూడూరు గ్రామ శివారులోని శివాలయం ఎస్సీ కాలనీకి చెందిన కే. విష్ణు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

మృతుడు విష్ణు గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న గూడూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచనామా నిర్వహించి, ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.