Good news | 10,060 పోస్టులతో జాబ్‌ క్యాలెండర్

Good news | 10,060 పోస్టులతో జాబ్‌ క్యాలెండర్

Good news | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ యువతకు భారీ శుభవార్త (Good news).. రాష్ట్ర ప్రభుత్వం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించి, ఉపాధి అవకాశాలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 10,060 పోస్టులతో సమగ్ర జాబ్ క్యాలెండర్ (Job Calendar) ను ప్రకటించారు. ఇకపై ప్రతి ఏటా ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

నోటిఫికేషన్ల తేదీల వివరాలు:

ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టుల భర్తీకి మే 15
91 గ్రూప్-1 పోస్టులకు ఆగస్టు 15
హోంశాఖలో 2,778 పోస్టులకు ఆగస్టు 15
750 గ్రూప్-2 పోస్టులకు సెప్టెంబర్ 15
503 ఏఈఈ పోస్టులకు సెప్టెంబర్ 15
పాఠశాల, ఇంటర్ విద్యకు చెందిన 3,004 పోస్టులకు అక్టోబర్ 15

ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం నిబద్ధత చూపుతోందని అధికార వర్గాలు తెలిపాయి.

Leave a Reply