Gold Rate – Today 16-9- Rate Growth |పసిడి ధర బాదుడు!.. స్పాట్‌ గోల్డ్‌ దూకుడు

Gold Rate – Today 16-9- Rate Growth |ఆంధ్రప్రభ వెబ్‌, బిజినెస్‌ ప్రతినిధి: బంగారం ధరల్లో మరోసారి స్వల్పంగా పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వరుసగా హెచ్చుతగ్గులకు లోనైన పసిడి.. బుధవారం (సెప్టెంబర్‌ 16) మళ్లీ పైకి కదిలింది. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,344గా ఉండగా.. గత ధరతో పోలిస్తే రూ.27 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం గ్రాముపై రూ.25 పెరిగి రూ.14,065కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధరకు కొనుగోళ్ల మద్దతు కనిపించింది. స్పాట్‌ గోల్డ్‌ గ్రాము $139.24గా ఉండగా, ఔన్స్‌ ధర $4,330.15కు చేరింది. ఔన్స్‌ ధరలో ఒక్కరోజులోనే $37.24 పెరుగుదల నమోదైంది. డాలర్‌ కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌ సెంటిమెంట్‌, పెట్టుబడిదారుల కొనుగోళ్లు వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

ప‌ది రోజుల బంగారం ధ‌ర‌ల ట్రెండ్‌

సెప్టెంబర్‌ 7న 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.15,415 ఉండగా.. సెప్టెంబర్‌ 16 నాటికి రూ.15,344కు చేరింది. అంటే పది రోజుల వ్యవధిలో మొత్తం మీద రూ.71 తగ్గింది. అయితే ఈ కాలంలో ధరలు ఒకే దిశలో సాగలేదు. సెప్టెంబర్‌ 10న గ్రాము ధర రూ.15,551తో గరిష్ఠ స్థాయిని తాకగా.. సెప్టెంబర్‌ 15న రూ.15,317కు పడిపోయింది. కేవలం కొన్ని రోజుల్లోనే ధరల్లో గణనీయమైన హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. తాజాగా సెప్టెంబర్‌ 16న రూ.27 పెరగడంతో మార్కెట్‌ మళ్లీ రికవరీ బాట పట్టిందా? అనే ఆసక్తి నెలకొంది.

డిజిటల్‌ గోల్డ్‌ ధర ఎంతంటే?

డిజిటల్‌ గోల్డ్‌ గ్రాము ధర ప్రస్తుతం రూ.15,591గా ఉంది. ఇది 24 క్యారెట్ల బంగారం సూచించిన గ్రాము ధర కంటే సుమారు రూ.247 అధికం. డిజిటల్‌ గోల్డ్‌ ధరలో ప్లాట్‌ఫామ్‌ ఛార్జీలు, పన్నులు తదితర అంశాల కారణంగా భౌతిక/స్పాట్‌ ధరలతో వ్యత్యాసం ఉండొచ్చు.