ముంబై : బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత వారం రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు నిన్నటి నుంచి రికార్డ్ సృష్టిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ మార్కెట్ రేట్లు మన దేశంలో బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అక్షయ తృతీయకు ముందు బంగారు మార్కెట్లో చాలా కార్యకలాపాలు జరుగుతాయి. బంగారం ధరల్లో బలమైన పెరుగుదల ఉంది.
ఫ్యూచర్స్ మార్కెట్ MCXలో, 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.12,00 పెరిగి 93224 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో దేశీయ మార్కెట్లో బంగారం కూడా 10 గ్రాములకు రూ.95,400 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి ధర కిలోకు రూ.97,100 వద్ద కొనసాగుతోంది. ఏప్రిల్ 11న ఉదయం 11 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1850 పెరుగగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాములపై ఏకంగా రూ.2,020 ఎగబాకింది. ఒకవైపు, ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి.
మరోవైపు, దేశీయ మార్కెట్లో బంగారం 10 గ్రాములకు రికార్డు స్థాయిలో రూ.95,400 కు చేరుకుంది. బంగారం ధర రూ.2,020 పెరిగింది.గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈరోజు ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,020 పెరిగి రూ.95,550 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలోఅక్కడ కూడా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు కొనడానికి, మీరు రూ. 95,400 చెల్లించాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.95,400కు చేరుకోగా, 22 క్యారెట్ల ధర రూ.87,450 వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ మార్కెట్ రేట్లు మన దేశంలో బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఇంకా అమెరికా డాలర్, రూపాయి మారక విలువ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు కూడా బంగారం ధరలను నిర్ణయిస్తాయి. అందుకే గోల్డ్ ధరలు స్థిరంగా ఉండవు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బంగారు ఆభరణాల దిగుమతులపై సుంకాలు విధించడంతో పసిడి పరుగు ఆగింది. అది కాస్త ఇప్పుడు రివర్స్ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర 17 సార్లు ఆల్ టైమ్ రికార్డులను తాకింది. ఇక్కడి నుంచి బంగారం ధర రూ. లక్ష దిశగా దూసుకువెళుతున్న సమయంలో ఆగింది. కానీ కొందరేమో రూ.56 వేలకు దిగి వస్తుందని చెబుతుండగా, మరి కొంత మంది నిపుణులు లక్ష మార్క్ దాటే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.