ముంబై : మొన్నటి వరకు చుక్కలు చూపించిన బంగారం ధరలు ఒక్కసారిగా దిగొస్తున్నాయి. తులం బంగారం ధర రూ.లక్ష దాటి అందరినీ షాక్‌కి గురిచేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గోల్డ్ రేట్స్ మళ్లీ దిగొస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లోనే ఏకంగా రూ.6 వేలకి పైగా తగ్గడం విశేషం. తాజాగా శుక్రవారం కూడా బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గడిచిన వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. తులం బంగారం ధర రూ. లక్షన్నరకు చేరుతుందని పలు అభిప్రాయాలు వచ్చాయి. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.85,076కి దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 92,810 వద్ద కొనసాగుతోంది.