Gold Price-11-9-2026-Andhra Prabha | బంగారం ధ‌ర త‌గ్గింది.. జాతీయ‌, అంత‌ర్జాతీయ మార్కెట్‌లో త‌గ్గుద‌ల‌.. ధ‌ర‌ ఎంతంటే!

Gold Price-11-9-2026-Andhra Prabha |ఆంధ్రప్రభ వెబ్‌, బిజినెస్ ప్రతినిధి : ప‌సిడి ధ‌ర‌లు ఈ రోజు ( సెప్టంబ‌ర్ 11) త‌గ్గింది. జాతీయ‌, అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లోనూ బంగారం ధ‌ర‌లు త‌గ్గాయి. దీంతో బంగారం కొనుగోలుదారుల‌కు ఊర‌ట క‌లిగింది. నిన్ని పెరిగిన బంగారం ధ‌ర‌లు ఈ రోజు భారీగా తగ్గాయి. సెప్టెంబర్‌ 11న 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15,289కు చేరగా.. ఒక్కరోజులోనే రూ.262 తగ్గింది. 22 క్యారెట్ల పసిడి గ్రాము ధర రూ.14,015గా నమోదైంది. ఇది క్రితం రోజుతో పోలిస్తే రూ.240 తక్కువ. 18 క్యారెట్ల బంగారం గ్రాముపైనా రూ.196 తగ్గి రూ.11,467కు చేరింది.

10 గ్రాములపై రూ.2,620 తగ్గుదల

24K బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ.1,52,890గా ఉంది. క్రితం రోజుతో పోలిస్తే రూ.2,620 తగ్గింది. 22K పసిడి 10 గ్రాముల ధర రూ.1,40,150కు చేరింది. అంటే రూ.2,400 తగ్గుదల కనిపించింది.

పరిమాణం 24K 22K 18K
1 గ్రాము రూ.15,289 రూ.14,015 రూ.11,467
8 గ్రాములు రూ.1,22,312 రూ.1,12,120 రూ.91,736
10 గ్రాములు రూ.1,52,890 రూ.1,40,150 రూ.1,14,670
100 గ్రాములు రూ.15,28,900 రూ.14,01,500 రూ.11,46,700

అంతర్జాతీయ మార్కెట్లోనూ..

అంతర్జాతీయ స్పాట్‌ మార్కెట్లో కూడా పసిడి ధర బలహీనంగా ఉంది. ఔన్స్‌ బంగారం ధర $4,352.47 వద్ద ఉండగా, ఒక్కరోజులో $13.30 తగ్గింది. గ్రాము ధర $139.95గా ఉంది. ఇది $0.41 తగ్గింది. అమెరికా వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్‌ కదలికలు, బాండ్‌ ఈల్డ్స్‌, లాభాల స్వీకరణ వంటి అంశాలు ప్రస్తుతం అంతర్జాతీయ పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. భారీగా పెరిగిన తర్వాత గోల్డ్‌లో కరెక్షన్‌ రావడం కూడా ఈ పతనానికి ఒక కారణంగా చూడవచ్చు.

ప‌ది రోజుల్లో ధరల తీరు చూస్తే..

సెప్టెంబర్‌ 2న 24K బంగారం గ్రాము ధర రూ.15,202గా ఉండగా, సెప్టెంబర్‌ 10న రూ.15,551కు చేరింది. అంటే ఈ మధ్యలో ధరలు ఒక దశలో పుంజుకున్నాయి. అయితే సెప్టెంబర్‌ 11న ఒక్కసారిగా రూ.262 త‌గ్గింది. గత పది రోజుల గణాంకాలు చూస్తే బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కొనసాగుతున్న విషయం స్పష్టమవుతోంది. సెప్టెంబర్‌ 3న రూ.333 పెరగడం, సెప్టెంబర్‌ 9న రూ.104 తగ్గడం, సెప్టెంబర్‌ 10న రూ.120 పెరగడం, తాజాగా రూ.262 పతనం కావడం మార్కెట్‌లోని అస్థిరతను సూచిస్తోంది.

ఆగ‌స్టు 27 నుంచి బంగారం ధరల వివరాలు
తేదీ 24 క్యారెట్‌ 22 క్యారెట్‌
సెప్టెంబర్ 11, 2026 రూ.15,289 (-262) రూ.14,015 (-240)
సెప్టెంబర్ 10, 2026 రూ.15,551 (+రూ.120) రూ.14,255 (+రూ.110)
సెప్టెంబర్ 9, 2026 రూ. 15,431 (-రూ.104) రూ.14,145 (-రూ.95)
సెప్టెంబర్ 8, 2026 రూ. 15,535 (+ రూ.120) రూ.14,240 (రూ.110)
సెప్టెంబర్ 7, 2026 రూ.15,415 (-రూ.65) రూ.₹14,130 (-60)
సెప్టెంబర్ 6, 2026 రూ.15,480 ( స్థిరం ) రూ.14,190 ( స్థిరం )
సెప్టెంబర్‌ 5, 2026 రూ.15,480 (-రూ.186) రూ.14,190 (-రూ.170)
సెప్టెంబర్‌ 4, 2026 రూ.15,666 (+రూ.131) రూ.14,360 (+రూ.120)
సెప్టెంబర్‌ 3, 2026 రూ.15,535 (+రూ.333) రూ.14,240 (+రూ.305)
సెప్టెంబర్‌ 2, 2026 రూ.15,202 (-రూ.207) రూ.13,935 (-రూ.190)
సెప్టెంబర్‌ 1, 2026 రూ.15,409 (-రూ.268) రూ.14,125 (-రూ.245)
ఆగస్టు 31, 2026 రూ.15,677 (-రూ.147) రూ.14,370 (-రూ.135)
ఆగస్టు 30, 2026 రూ.15,824 (స్థిరం) రూ.14,505 (స్థిరం)
ఆగస్టు 29, 2026 రూ.15,824 (-రూ.289) రూ.14,505 (-రూ.265)
ఆగస్టు 28, 2026 రూ.16,113 (+రూ.49) రూ.14,770 (+రూ.45)
ఆగస్టు 27, 2026 రూ.16,064 (-రూ.311) రూ.14,725 (-రూ.285)

డిజిటల్ గోల్డ్‌ కొనేవారికి కీలక విషయం

భారతదేశంలో డిజిటల్‌ బంగారం ధర ప్లాట్‌ఫామ్‌ను బట్టి మారుతోంది. ప్రస్తుతం 24K డిజిటల్‌ గోల్డ్‌ జీఎస్టీతో కలిపి సుమారు గ్రాముకు రూ.15,550–రూ.16,350 మధ్య కనిపిస్తోంది. భౌతిక బంగారం ధరతో పోలిస్తే డిజిటల్‌ గోల్డ్‌లో కొనుగోలు ధర కొంత ఎక్కువగా ఉండొచ్చు.

దీనికి కారణం 3 శాతం జీఎస్టీతో పాటు ప్లాట్‌ఫామ్‌ స్ప్రెడ్‌/మార్జిన్‌, కొనుగోలు-విక్రయ ధరల మధ్య వ్యత్యాసం వంటి అంశాలు. అందువల్ల డిజిటల్‌ గోల్డ్‌ను కేవలం స్క్రీన్‌పై కనిపించే గ్రాము ధర ఆధారంగా కాకుండా కొనుగోలు ధర, విక్రయ ధర, జీఎస్టీ, ఇతర ఛార్జీలు పరిశీలించి కొనడం మంచిది.

మొత్తంగా చూస్తే.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం బలహీనత, దేశీయ ధరల్లో వరుస హెచ్చుతగ్గులు ప్రస్తుతం మార్కెట్‌కు కరెక్షన్‌ సంకేతాలను ఇస్తున్నాయి. అయితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడ్‌ నిర్ణయాలపై అంచనాలు, డాలర్‌ కదలికలు వంటి అంశాలు మళ్లీ పసిడి ధరలను పైకి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. అందువల్ల తక్షణ దిశ కంటే రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్పాట్‌ గోల్డ్‌ కీలకంగా మారనుంది.