మొక్కజొన్న పంటకోసం గోద్రేజ్ ఆగ్రోవెట్ ’అషిటక‘

కామారెడ్డి, ఆగస్టు 20(ఆంధ్రప్రభ ) : భారతదేశంలోని ప్రముఖ వైవిధ్యభరితమైన వ్యవసాయ – వ్యాపార సంస్థల్లో ఒకటైన గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (గోద్రేజ్ ఆగ్రోవెట్ ), మొక్కజొన్న పంటతో పాటుగా వచ్చే కలుపు మొక్కలను నివారించటం కోసం ప్రత్యేకంగా కొత్త కలుపు మందును విడుదల చేసినట్లు వెల్లడించింది. ఐఎస్ కె జపాన్ సహకారంతో అభివృద్ధి చేయబడిన ఈ నూతన కలుపు మందును అషిటక పేరిట మార్కెట్ లోకి తీసుకువచ్చింది.

ఈ ఆవిష్కరణ సందర్భంగా గోద్రేజ్ ఆగ్రోవెట్ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ సీఈఓ రాజవేలు ఎన్ కె మాట్లాడుతూ… పర్యావరణ, మార్కెట్ సవాళ్ల నుండి వ్యవసాయ రంగ భవిష్యత్తును కాపాడేలా, భారతీయ రైతులకు సాధికారత కల్పించే, వ్యవసాయ కుటుంబాలను ఉద్ధరించే వినూత్నమైన, పరిశోధన-ఆధారిత పరిష్కారాలను అందించడం గోద్రేజ్ ఆగ్రోవెట్‌ వద్ద త‌మ లక్ష్యమ‌న్నారు. మొక్కజొన్న రైతులు మెరుగైన దిగుబడిని సాధించడానికి పంట ఎదిగే తొలిదశలో సమర్థవంతమైన రీతిలో కలుపు నిర్వహణ చేయడం చాలా ముఖ్యమైనదన్నారు. ఈ ప్రాంతంలోని రైతులకు దిగుబడిని మెరుగు పరచడానికి, లాభదాయకతను పెంచడానికి శక్తివంతమైన పరిష్కారాన్ని అందించే దిశగా వేసిన ఒక ముందడుగుగా అషిటక విడుదల నిలుస్తుందన్నారు.

Leave a Reply