బాసర (నిర్మల్ జిల్లా) ఆగస్టు 29 ఆంధ్రప్రభ : బంగాళాఖాతంలో ఉప్పరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజులు భారీగా కురిసిన వర్షాలతో బాసర వద్ద గోదావరి (Godavari) నది ఉగ్రరూపం ప్రదర్శిస్తుంది. ఎగువన మహారాష్ట్ర (Maharashtra) లో సైతం భారీగా కురిసిన వర్షాలకు గోదావరి వరద నీరు వచ్చి భారీగా చేరుతుంది. గోదావరి ఒకటవ ఘాట్ నుండి ఎండవ ఘాట్ వరకు నిర్మించిన మెట్ల వరకు వరద నీరు ప్రవహిస్తుండడం మొదటిసారి అని స్థానికులు అధికారులు పేర్కొన్నారు.
గోదావరి నది వద్దకు పోలీసులు , రెవెన్యూ అధికారులు (Revenue Officers) ఎవరిని అనుమతించడం లేదు. గోదావరి నది వరద ప్రవాహాన్ని తిలకించేందుకు భారీగా పర్యాటకులు తరలివస్తున్నారు. ఆలయం నుండి గోదావరి నదికి వెళ్ళు మార్గం పూర్తిగా నీటితో నిండిపోవడంతో నదికి వెళ్ళు మార్గంలోని ప్రైవేట్ లాడ్జ్ అపార్ట్ మెంట్ ఇండ్లలోకి నీరు వచ్చి చేరింది. పోలీసులు (police) స్థానికులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రైవేట్ లాడ్జిలోని కార్లను నీటిలో తరలిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.