గుడిగండ్ల గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్‌గా అవకాశం ఇవ్వండి

  • సేవకుడిగా ప్రజల కోసం పని చేస్తా
  • కాంగ్రెస్ బలపరిచిన గుడిగండ్ల సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్

మక్తల్, ఆంధ్రప్రభ : గుడిగండ్ల గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సర్పంచ్‌గా తనకు ఒక అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ గ్రామస్తులను కోరారు. ఆదివారం ఆయన తన మద్దతుదారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి గ్రామంలోని వార్డులలో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుసుకుని, తాను సర్పంచ్‌గా గెలిపిస్తే చేపట్టబోయే అభివృద్ధి పనులను వివరించారు. మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో గుడిగండ్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. ఎన్నికల్లో తనను ఆదరించి ఆశీర్వదించి సర్పంచ్‌గా గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటినీ గుర్తించి వాటికి పరిష్కారం చూపించేందుకు ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని కోరారు. మంత్రి వాకిటి శ్రీహరి అండతో గ్రామంలోని మౌలిక సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని, రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తామని తెలిపారు.

గ్రామాభివృద్ధే ధ్యేయంగా ప్రత్యేక నిధులు తీసుకువచ్చి గుడిగండ్ల గ్రామ రూపురేఖలను పూర్తిగా మార్చుతామని అన్నారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి అండగా నిలవాలని సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ గ్రామ ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, సిపి. తిరుపతి, ఖాజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply