రైతు బిడ్డను సర్పంచ్‌గా అవకాశం ఇవ్వండి..

  • పోతంగల్ కలాన్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి, గొల్ల కల్పన కిష్టయ్య
  • ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి

గాంధారి, ఆంధ్రప్రభ : సామాన్య కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డను సర్పంచ్‌గా అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలంటూ గాంధారి మండలం పోతంగల్ కలాన్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గొల్ల కల్పన కిష్టయ్య గ్రామంలో జోరుగా ప్రచారం నిర్వహించారు. పోతంగల్ కలాన్ సర్పంచ్‌గా అవకాశం ఇస్తే గ్రామంలోని తాగునీటి సమస్యతో పాటు అన్ని గల్లీలలో మురికికాలువలు నిర్మించడం, సిసీ రోడ్లు వేయించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

గ్రామస్తుల సహకారంతో గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తన శాయశక్తుల మేర కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లు అందేలా చూసేందుకు, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడి ఇంటికి చేరేలా కృషి చేస్తానని మాట ఇచ్చారు.

గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతిరోజూ పారిశుద్య పనులు జరిగేలా చర్యలు తీసుకుంటానని, అన్ని వార్డుల్లో వీధిదీపాలను ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నిరంతర శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకునేలా అవగాహన కల్పిస్తానని చెప్పారు. సంవత్సరానికి ఒకసారి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయిస్తానని తెలిపారు.

తమ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి, పోతంగల్ కలాన్ గ్రామ సర్పంచ్‌గా భారీ మెజార్టీతో తనను గెలిపించాలంటూ గొల్ల కల్పన కిష్టయ్య గ్రామస్తులను కోరారు.

Leave a Reply