Gita worker | బైక్‌పై నుంచి పడి…
ప్రమాదవశాత్తు కల్లు గీత కార్మికుడు
Gita worker | నవాబ్ పేట్, ఆంధ్రప్రభ : ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి పడి కల్లు గీత కార్మికుడు మృతిచెందిన సంఘటన నవాబ్ పేట్ మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… ఆర్కతల గ్రామానికి చేసిన గౌండ్ల రాంచంద్రయ్య(55) మంగళవారం రాత్రి ఇంట్లో నుండి పొలానికి కల్లు తీసేందుకు వెళ్తుండగా గ్రామ పరిసర ప్రాంతంలో కాలువలో ప్రమాదవశస్తూ బైకుతో పాటు పడి మృతిచెందాడు. కుమారుడు మధుసూదన్ గౌడ్ ఫిర్యాదు మేరకు ఎస్సై పుండ్లిక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


