గీతా శ్లోకాలను పారాయణం..

గీతా శ్లోకాలను పారాయణం..

, ఆంధ్రప్రభ : చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో డీవీడీబీఎస్‌ చిన్మయ(DVDBS Chinmaya) విద్యాలయలో ఇటీవల భగవద్గీతా పారాయణ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో డీబీ కాలనీలోని ప్రసన్న వేణి వేదమాలిక ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి అందరి ప్రశంసలు అందుకున్నారు. సంస్థ నిర్వాహకురాలు నాగవేణి మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన విద్యార్థులు పాఠశాల స్థాయి, పట్టణ స్థాయి, జిల్లా స్థాయి పోటీల్లో విజయాలు సాధించి ఇప్పుడు రాష్ట్ర స్థాయికి(state level) అర్హత సాధించారు.

పాఠశాల స్థాయి పోటీల్లో తారుష్, తనిష్క, థానైరా(Thanaira), ఋషి నందన్, నిత్య వాగ్మి, అభినయ, లిఖిత్ ప్రతిభ కనబర్చగా, జిల్లా స్థాయిలో థారుష్, నిత్య వాగ్మి, లిఖిత్, విజేతలుగా నిలిచారు. వీరిలో థారుష్, జ్యోష్ణిక రాష్ట్ర స్థాయి భగవద్గీతా పారాయణ పోటీలకు ఎంపికై, నవంబర్ 9న కడప చిన్మయ మిషన్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. చిన్న వయసులోనే గీతా శ్లోకాలను(Geeta Shlokas) పారాయణం చేసిన ఈ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply