ఏసీబీ వలలో టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌..

  • అడ్డంగా బుక్కైన జీహెచ్‌ఎంసీ అధికారిణి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నగరంలోని మెహిదీపట్నం జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ సునీత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. భవన నిర్మాణ అనుమతులు, క్లియరెన్స్‌ వ్యవహారంలో ఓ వ్యక్తి నుంచి రూ.4 లక్షలు లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించారు. ఈ క్రమంలో సునీత రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు, ఇతరుల పాత్రపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.