GHMC | కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

GHMC | కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
GHMC | అల్వాల్, ఆంధ్రప్రభ : GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఇవాళ ఉదయం అల్వాల్ సర్కిల్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణ, సిబ్బంది విధులపై ఆయన సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చిన కమిషనర్ కర్ణన్ (Commissioner Karnan) పరిశుభ్రత పనులను మరింత సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, ఏఎంఓహెచ్ మంజుల, ఎస్‌ఎస్ ప్రభాకర్, సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆకస్మిక తనిఖీలతో సర్కిల్‌లో పారిశుద్ధ్య పనులు మరింత వేగవంతమవుతాయని అధికారులు తెలిపారు.

