డబ్ల్యూపీఎల్ లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్ గుజరాత్ జేయింట్స్ జట్టు విజయం సాధించింది. వడొదర వేదికగా యూపీ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతోవిజయాన్ని అందుకుంది గుజరాత్ జట్టు.
కాగా, ఈమ్యాచ్ లో తొలుతు బ్యాటింగ్ చేసిన వారియర్స్.. నిర్ణీత ఓవర్లలో 143/9 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో దీప్తి శర్మ (39) టాప్ స్కోరర్ గా నిలిచింది. గుజరాత్ బౌలర్లలో ప్రియా మిశ్రా మూడు వికెట్లు తీయగా.. డియాండ్రా డాటిన్, ఆష్లీ గార్డనర్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. కశ్వీ గౌతమ్ ఒక వికెట్ పడగొట్టింది.
ఇక 144 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు.. 18 ఓవర్లలో మ్యాచ్ ను ముగించేసింది. కెప్టెన్ ఆష్లీ గార్డనర్ (52) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. లారా వోల్వార్డ్ట్ (22), హర్లీన్ డియోల్ (34 నాటౌట్), డియాండ్రా డాటిన్ (33 నాటౌట్) ఆకట్టుకున్నారు. ఈ విజయంతో మహిళల ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ బోణీ కొట్టింది.
కాగా, డబ్ల్యూపీఎల్‌లో భాగంగా రేపు (ఫిబ్రవరి 17న) జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.