Gayathri Estate | అవగాహన అవసరం

Gayathri Estate | అవగాహన అవసరం
- హక్కులు, బాధ్యతల గురించి తెలుసుకోవాలి
- జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
Gayathri Estate | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : వినియోగదారులు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. ఈ రోజు జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలలో భాగంగా గాయత్రి ఎస్టేట్(Gayathri Estate)లో ఉన్న గాయత్రి జూనియర్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన వినియోగదారుల అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 24వ తేదీన జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు(Central, State Governments) సూచనల మేరకు వినియోగదారులను చైతన్య పరిచేందుకు వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
ఇందులో భాగంగానే ఈరోజు వినియోగదారుల అవగాహన ర్యాలీని చేపట్టినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వారం రోజులపాటు కళాశాలలు, పాఠశాలలో తదితర ప్రదేశాలలో వినియోగదారుల అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, కొనుగోలు(Purchase) చేసే ప్రతి వస్తువు, సేవకు సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. మోసపూరిత ప్రకటనలు, అధిక ధరలు, నాణ్యత లేని వస్తువులపై అప్రమత్తంగా ఉండాలని, వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వినియోగదారుల ఫోరమ్‌లను ఆశ్రయించాలని జాయింట్ కలెక్టర్ ప్రజలను కోరారు.

కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తులు(Judges) కిషోర్ కుమార్, నారాయణరెడ్డి, కౌసర్ బేగం, డిఎస్ఓ రాజా రఘువీర్, వినియోగదారుల ఫోరం సెక్రెటరీ శివ మోహన్ రెడ్డి, వినియోగదారుల అసోసియేషన్ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.

