పార్టీ కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ధీశాలి…

పార్టీ కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ధీశాలి…

గన్నవరం, ఆంద్ర‌ప్ర‌భ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడు గారి 3వ వర్ధంతి సందర్భంగా గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారి ఆదేశాల మేరకు గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం నిర్వహించిన స్మారక సభలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి దొంతు చిన్నా మాట్లాడుతూ ఆయన రాజకీయ ప్రస్థానాన్ని స్మరించారు. 2014లో కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, 2017లో ఎమ్మెల్సీగా, 2020లో పార్టీ కేంద్ర కమిటీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన క్రమశిక్షణ, సిద్ధాంత నిబద్ధత పార్టీకి ఆదర్శమని తెలిపారు. ప్రతిపక్షంలో పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో గన్నవరం నియోజకవర్గంలో పార్టీకి అండగా నిలిచి, కార్యకర్తలకు ధైర్యం నూరిపోసిన నాయకుడు బచ్చుల అర్జునుడు గారేనని పేర్కొన్నారు.

2020 నుండి 2023 వరకు నియోజకవర్గ ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేశారని కొనియాడారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ఆయన పాత్ర విశేషమని పేర్కొన్నారు. యువతను రాజకీయాల్లోకి తీసుకురావడంలో, వారికి అవకాశాలు కల్పించడంలో ఆయన చూపిన చొరవ మరువలేనిదని తెలిపారు. ఆయన ఆశయాలను నెరవేర్చడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని సంకల్పించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ నాయకులు చిరుమామిళ్ల సూర్యం, దొంతు చిన్నా, గన్నవరం టౌన్ టిడిపి అధ్యక్షులు జాస్తి శ్రీధర్, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి బోడపాటి రవికుమార్, టీడీపీ జిల్లా కార్యదర్శి జొన్నలగడ్డ సుధాకర్, గన్నవరం మండల బీసీ సెల్ అధ్యక్షులు కొండేటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర టిఎన్ టియుసి కార్యదర్శి బుస్సే నాగప్రసాద్, నియోజకవర్గ తెలుగుమహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ, నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు చల్లగుళ్ళ సందీప్, గన్నవరం మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు బుస్సే సరిత, గన్నవరం మండల తెలుగుయువత అధ్యక్షులు నందిపాముల పృథ్వీ, జిల్లా విజిలెన్స్ బోర్డు డైరెక్టర్ తిరువీధి నరేష్, టిడిపి నాయకులు సొంగా సంతోష్, కంచర్ల సూర్యప్రకాష్, కొండేటి నాగరాజు, నిమ్మకూరి మధు, ఆరిఫ్ పఠాన్, యెల్లా రఘు, చల్లగుళ్ళ సుమంత్, గుత్తా జయేంద్ర, రాహుల్, జయంత్, జయరాం, సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply